గుజరాత్‌లోని నర్మద జిల్లా రాజ్‌పిప్‌లా పట్టణంలోని హర్‌సిద్ధీ మాత ఆలయంలో అమ్మవారికి దసరా నవరాత్రుల్లో బాగంగా ఖడ్గాలతో హారతి సమర్పిస్తారు. 420 ఏళ్లకు పైగా చరిత్ర గల అమ్మవారికి గత తొమ్మిదేళ్లుగా రాజ్‌పుత్‌లు ఖడ్గాలతో హారతి ఇస్తున్నారు. గుడి ముందు ఆవరణంలో పూలతో విల్లు, బాణం ముగ్గు వేసి, దాని మధ్యలో తెల్లటి పైజామా, కాషాయ తలపాగా ధరించిన దాదాపు 175 మంది యువకులు కూర్చొని హర్‌సిద్ధి మాతకు మహా హారతి సమర్పిస్తారు.