గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో మూడు బోట్లలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా శనివారం విహార యాత్రకోసం యానం వచ్చిన ఏడుగురిలో గోదావరిలో నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వారంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.