గాజా పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. భూతల దాడులు నిర్వహించేందుకు గతంలోనే సైన్యాన్ని సిద్దం చేసింది. ఈ మేరకు తమ బలగాలు గాజాలోకి ప్రవేశించి దాడులకు అనుకూల పరిస్థితులు ఏర్పరచువడమే తమ లక్ష్యమని పేర్కొంది. అత్యంత కట్టుదిట్టమైన పరిస్థితుల్లో తాము యుద్ధం తదుపరి దశలోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లు ‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్’ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు.