శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసినట్లు ఆలయ ఈఓ హరి సూర్యప్రకాష్ తెలిపారు.