ఐరోపా దేశాల్లో కరువు నేపథ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి సరి కొత్త ఉద్యమాన్ని చేపట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా పలు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. అక్కడ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని, కరువు కారణంగా దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంటలకు నీటి అవసరం ముఖ్యమని పర్యావరణ కార్యకర్తలు తెలిపారు.