గుజరాత్లో ఓ వ్యక్తి అమ్మే నెయ్యి కిలో ఏకంగా రూ.2 లక్షల దాకా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. గోండాల్‌లో రమేష్‌భాయ్ రూపరేలియా అనే రైతు ఆవుపాలతో నెయ్యిని చేసి దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు ఇలా రకరకాల మూలికల్ని కలుపుతాడు. కిలో నెయ్యికి దాదాపు 31 లీటర్ల పాలు కావాలి. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఆ నెయ్యికి అంత రేటు.