బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలకు కొంతమంది పోలీసులు సహకరించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ దూకుడు పెంచి ఓట్ల అక్రమాల్లో ఖాకీల పాత్రపై మరోసారి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ విధుల్లో సచివాలయ మహిళా పోలీసులు భాగస్వాములవుతున్నారు. ఓటర్లకు సంబంధించిన వివరాలను ఈఆర్‌వో అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ పంపించడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది.