వైసీపీ ప్రభుత్వంపై PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వానిది ఒక వైపు కరెంటు కోతలు... మరొక వైపు కరెంటు బిల్లుల వాతలు అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. అదనపు భారం దాదాపు రు 50,000 కోట్లు ఉంటుందన్నారు. అసలు కంటే కొసరు ఎక్కువ అని ఎద్దేవ చేశారు. బాదుడు రెడ్డిగా జగన్‌రెడ్డి తన పేరు మార్చుకుంటే సరిపోతుందని సెటైర్లు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa