రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను సంక్షేమ పథకాలపై పెట్టడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి , పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు తిరుపతి లోని గాంధీ భవన్ ట్రస్టు భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిరాజ్‌సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రతి పథకానికి రాష్ట్రానికి అందిస్తోంది. ఎక్కడా కూడా కేంద్రం ఇస్తున్నట్టు తెలియజేయటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే నా శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపివేస్తామని గిరిరాజ్‌సింగ్ తీవ్రంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa