రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఆదివారం నాడు టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నారా లోకేష్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పార్టీ నేతలకు నారా లోకేశ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa