రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయమని, అది కేవలం జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్తోనే జరుగుతుందని జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వరుణ్ ఆ పార్టీ కార్యనిర్వహణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్ పలువురు మహిళలు, యువతకు పార్టీ కండువాలు వేసి సాదర స్వాగతం పలికారు. నగర అధ్యక్షుడు పొదిలి బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, నగర కార్యదర్శి ఆకుల అశోక్, నాయకులు జయరాంరెడ్డి, జయమ్మ, సోమసుందరి, అనురాధ, అనసూయ, సరిత, మంజుల పాల్గొన్నారు.