రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 523 పోస్టులను భర్తీ ప్రక్రియకి అనుగుణంగా వర్సిటీ అధికారులు వందశాతం రోస్టర్ జాబితాను విడుదల చేశారు. రోస్టర్ జాబితాలో తప్పనిసరిగా మహిళలకు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరముంది, కానీ ఈ జాబితాలో మహిళలకు, విభిన్న ప్రతిభావంతుల ప్రస్తావన లేకపోవడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వర్గాలను నిర్లక్ష్యం చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు.