ఓటర్లను స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని , వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పల్నాడు జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేసే పరిస్థితి లేదు. కారంపూడికి చెందిన మహిళను ప్రసవం కోసం 3 ఆస్పత్రులు తిప్పారు. బాధితురాలి భర్త ఈ సమయంలో ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనలకు జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలను బెదిరించి గెలవాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బొల్లాకు ప్రజలు గుణపాఠం చెబుతారు అని జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa