ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల దేవస్థానం అధికారుల నిర్వాకం చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం ఎంపీ శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా.. భక్తులకు భోజనాల నిమిత్తం ఆలయ సిబ్బంది ఎంపీ నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. అయితే చెక్కును అన్నదానం ట్రస్టు పేరున కాకుండా ఓ అధికారి పేరిట తీసుకున్నారు. డబ్బులు ట్రస్టుకే ఇచ్చినట్లు సిబ్బంది చెప్తున్నా.. చెక్కును చూపమంటే బ్యాంకులో వేశామని బుకాయిస్తున్నారు.