యూపీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 14 మంది పిల్లల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న 6 నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలికలు హెచ్‌ఐవీ, హెపటైటిస్ లాంటి వ్యాధుల బారిన పడ్డారు. వీరిలో 6గురికి హెపటైటిస్ బీ, 6గురికి హెపటైటిస్ సీ, 2కి హెచ్‌ఐవీ సోకిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ లాలా లజపతి రాయ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.