ఖరీఫ్ లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు, సామాజిక వనాల సాగుకు సంబంధించి 93 లక్షల ఎకరాలకు ఈ-క్రాప్ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఖరీఫ్ లో 15 రకాల పంటలకు దిగుబడి ఆధారంగా, 6 రకాల పంటలకు వాతావరణ ఆధారితంగా బీమా కవరేజి అమలవుతోందని ఆయన వెల్లడించారు. ఖరీఫ్ ఈ-క్రాప్ డేటాను అక్టోబరు 31వ తేదీనాటికి జాతీయ బీమా పోర్టలు పంపిస్తామని పేర్కొన్నారు.