పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య అతని పీక నొక్కి చంపేసింది. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు(60) నిత్యం మద్యం తాగుతూ వేధిస్తుండడంతో భార్య వెంకటలక్ష్మీ విసిగిపోయింది. దీంతో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అతనిని పీక నొక్కి చంపేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది.