పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీవాటరింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటిని మరల్చేందుకు నిర్మాణం చేస్తున్న కాలువల పనులను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి ఉన్నారు.