బాపట్లజిల్లాలో ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐ లను సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్టూరు సీఐ ఫిరోజ్, మార్టూరు ఎస్ఐ కె. కమ లాకర్, పర్చూరు ఎస్ఐ ఎన్. సి. ప్రసాద్, యద్దన పూడి మాజీ ఎస్ఐ, ప్రస్తుతం డీసీఆర్బీలో ఉన్న హనోక్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వీరిని సస్పెండ్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు.