చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నారావారిపల్లిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. బుధవారం నుంచి భువనేశ్వరి చేపట్టనున్న "నిజం గెలవాలి" కార్యక్రమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు.