మచిలీపట్నం, మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో ముగ్గురు గిరిజన మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు జేసీ అపరాజిత సింగ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జేసీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళలను పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని, బాధితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు.