గాజా, ఇజ్రాయిల్ దాడులపై మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందిస్తూ...... ఇజ్రాయిల్ని సపోర్ట్ చేయడం బీజేపీ తప్పు అని అన్నారు. విదేశాంగ విధానం పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. దేశంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయన్నారు. జీఎస్టీ ద్వారా ఆదాయాన్ని దోచుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతుల్లో వెళ్తుందని చింతా మోహన్ అన్నారు. విద్యా వ్యవస్థని బ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.