మహిళలపై దాడికి పాల్పడిన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేష్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో ముగ్గురు గిరిజన బాధిత మహిళలను కేవీపీఎస్ నేతలు కొడాలి శర్మ, మిరియాల ఆనంద్ బెనర్జీ, కె.బాబూరావు తదితరులు పరామర్శించారు. బాధిత మహిళలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మీర్ రిజ్వాన్, సీపీఐ నేత అజ్జాడ ప్రసాద్, అంబేద్కరిస్టు దాసి సీతారామరాజు తదితరులు దాడిని తీవ్రంగా ఖండించారు.