విశాఖలో కరెన్సీ కట్టలు కలకంరేపాయి. రూ.కోట్లలో హవాలా డబ్బు గుట్టురట్టు అయ్యింది. ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనంగా మారింది. వాషింగ్ మిషన్‌లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. భారీగా కరెన్సీ కట్టలతో పాటుగా ఏకంగా 30 మొబైల్స్‌ను కూడా సీజ్ చేశారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు. అలాగే వాహానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ కట్టకుల సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్లు కేసు నమోదు చేశారు. ఈ డబ్బు ఎవరిదానే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ డబ్బుల్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన డబ్బులు రూ.కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇంత భారీ ఎత్తున కరెన్సీని ఇలా వాషింగ్ మెషిన్‌లో తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ కరెన్సీ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.