దరఖాస్తు చేసిన 28 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఘటన యూపీలో జరిగింది.యుపికి చెందిన అంకుర్ గుప్తా 1995లో పోస్టల్ ఉద్యోగానికి అప్లై చేశారు.15 రోజుల ట్రైనింగ్ తీసుకున్నా తర్వాత అతడిని అనర్హుడిగా ప్రకటించారు. దీంతో అతను కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తపాల శాఖ సుప్రీంకు వెళ్లింది. కింది కోర్టు తీర్పును సుప్రీం సమర్థించడంతో అతనికి ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్ అందింది.