ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 61శాతం తగ్గి రూ.505.3కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,299.2కోట్లు అర్జించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. నవంబర్ 21న డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది.