చీరాల కోర్టు ఆవరణంలో కక్షి దారుల అవసరార్థం కొరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మంచినీటి ట్యాంక్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎమ్మిడి శెట్టి గోపాలకృష్ణమూర్తి, ప్రదీప్ ల సహకారంతో మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కక్ష దారులు పాల్గొని ఏర్పాటు హర్షం వ్యక్తం చేశారు.