సిపిఎం ఆధ్వర్యంలో 15న విజయవాడలోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ప్రజారక్షణ భేరి పోస్టర్ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు ముందుగా అక్టోబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు బయలుదేరి 15న విజయవాడ కు చేరుకుంటాయని చెప్పారు.