పెళ్లిలో ఉంగరాలు మార్చుకునే సమయానికి బాత్రూమ్‌కు వెళ్లిన వరుడు ఎంతకీ బయటికి రాలేదు. చివరకు అందరూ బతిమలాడటంతో బయటకు వచ్చిన వరుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. దీంతో వివాహం రద్దయింది. ఈ ఘటన బుధవారం విశాఖపట్నం జిల్లా పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. సంబంధం కుదిరిన తర్వాత ఫోన్‌లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa