ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్పై కోర్టు వెకేషన్ బెంచ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని.. చంద్రబాబు తరపు లాయర్లు కోర్టుకు వినతి అందజేశారు.