పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో ఉపాధి హామీ పనులను అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాటిగుంట పాళ్యం పరిధిలో ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏర్పాటు చేసిన అమృత సరోవర్ చెరువును, చెక్ డ్యామ్ ను కేంద్ర జలశక్తి అభియాన్ కమిటీ పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ సుచీంద్ర కుమార్ పట్నాయక్, డా. సోమరేంద్రో సింగ్ , డ్వామా పిడి గంగభవాని, తదితరులు పాల్గొన్నారు.