జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు, నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజక వర్గం సదుం మండలంలోని బూరగమందలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.