మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నరోత్తం మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. దతియాలో జరిగిన ఓ సభలో మంత్రి మిశ్రా పాల్గొని మాట్లాడుతూ దతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, హేమ మాలిని కూడా డ్యాన్స్ చేసే స్ధాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. దీంతో మిశ్రా వాఖ్యలపై జేడీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మిశ్రా తన సొంత పార్టీ ఎంపీ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్నారు.