కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ వద్ద గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి దిగ్ర్భాంతి ని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది కూలీలు మృత్యువాత పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.