దేవీ శరన్నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు అటు ఆలయాలు, ఇటు మండపాల్లో ఘనంగా పూజలందుకుని. పలు అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు గంగమ్మ ఒడికి చేరారు. ప్రతిష్ఠించిన అమ్మవారి ప్రతిమలకు బుధవారం ఘనంగా శోభాయాత్రను నిర్వహించి నిమజ్జనం చేశారు. అంతకుముందు మండపాల వద్ద లడ్డూ పాటలు, అమ్మవారి చీరల వేలం పాటలు నిర్వహించగా వాటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. నేటి నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.