కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. 2 రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ల కాన్ఫరెన్స్‌ను నేడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైమానిక దళ టాప్ కమాండర్ల నుద్దేశించి రాజనాథ్ సింగ్ ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు.