ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎంఈఓ రామాంజనేయులు పేర్కొన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంఆర్సి కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లోని సామర్థ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహిస్తోందని అన్నారు.మండలంలోని 18 పాఠశాలల నుంచి 32తరగతుల విద్యార్థులకు నవంబర్ 3న సర్వే నిర్వహిస్తారన్నారు.