ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో 'వై ఏపీ నీడ్స్ జగన్ ' కార్యక్రమం చేపట్టారు. వాలంటీర్లు, గృహ సారథులు , సచివాలయ కన్వీనర్లు, గ్రామ కమిటీ కన్వీనర్లు ఇంటింటికి వెళ్లి కార్యక్రమం గురించి వివరించాలన్నారు.