ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.60లు పలుకుతోంది. ఉల్లి సాగులో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే టాప్ లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్ నుంచి అక్టోబరు వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరిగడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 777 క్వింటాళ్ల ఉల్లి రాగా క్వింటా కనిష్ఠ ధర రూ.2,501, గరిష్ఠ ధర రూ.5,318 పలికింది.