వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు ఇద్దరు విటుల పై నగరంపాలెం పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు పట్టణంలోని కేవీపీ కాలనీ 1వ లైనులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు గురువారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు, ఇద్దరు విటులను, ఒక మహిళను స్టేషన్ కు తీసుకొళ్లారు. మహిళను రెస్క్యూ హోం కు తరలించారు. నిర్వాహకురాలు, విటుల పై కేసు నమోదు చేశారు.