పోలాకి మండలం పిన్నింటి పేట సచివాలయ పరిధిలో రూ. 21. 80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు బాగుండాలని ఉద్దేశ్యంతో సిఎం జగన్ సచివాలయలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.