రాజాం మండల పరిధిలోని సోపేరు గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలు వినియోగించుకోవాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. రాజాం మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు లావేటి రాజగోపాల్ నాయుడు, ఎంపీడీవో బాసూరి శంకర్రావు, తహసీల్దార్, ఈవోపీఆర్ అండ్ ఆర్డి, మెడికల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, సర్పంచులు, స్థానికులు హాజరయ్యారు.