వైసీపీ అధినేత తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అన్నారు. 'కావలిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైంది. నడిరోడ్డుపై పట్టపగలు వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ సైకో జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయింది.' అని వ్యాఖ్యానించారు.