రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. శుక్రవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వారి సేవలు వివిధ రంగాల్లో అందిస్తున్నట్లు వివరించారు.