సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైయస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు. ఇవాళ మూడో రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో భీమిలి, కోస్తాంధ్రలో బాపట్ల, రాయలసీమలో పొద్దుటూరులలో జరుగనుంది.