సకల జనుల సంక్షేమమే అజెండాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచి, వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చిన నేతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని, బలహీన వర్గాలకు అధికారం ఇచ్చిన పార్టీగా వైయస్ఆర్సీపీ చరిత్ర తిరగరాసిందని అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర సభలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. పైరవీలతో కాకుండా సీఎం వైయస్ జగన్ ఫైటర్‌గా రాజకీయాల్లో గెలిచారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ బడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న సీఎం వైయస్ జగన్ అని చెప్పారు.