రాష్ట్రంంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. వైయస్ జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైయస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు. మళ్లీ జగనే రావాలి జగనే కావాలి అంటూ ఒకే గళమై నినదిస్తున్నారు. శుక్రవారం రెండో రోజు యాత్రలోనూ ఇదే చైతన్యం వెల్లువెత్తింది. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు సీఎం వైయస్ జగన్ చేసిన మంచిని వివరించి.. పేదలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో జరిగింది.మూడు నియోజకవర్గాల్లోనూ యాత్ర సాగిన రహదారులు జనంతో కిటకిటలాడాయి. ‘సామాజిక న్యాయ నిర్మాత వర్ధిల్లాలి.. జై జగన్’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించాయి. సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేతలు వివరించిన ప్రతిసారీ ప్రజలు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. మళ్లీ జగనే కావాలి అంటూ నినదించారు. సామాజిక సాధికార యాత్ర మూడో రోజున రాయలసీమలో వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, కోస్తాలో బాపట్ల జిల్లా బాపట్లలో, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గాల్లో జరుగుతుంది.