భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సంస్థ చాలా ఏళ్లుగా భారీ నష్టాల్లో నడుస్తోంది. ఈ నష్టాలను పూడ్చలేక భారత ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ప్రభుత్వం అమ్మడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఆ కంపెనీ భారీ లాభాలు ఆర్జిస్తూ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది. ఈ సంస్థ కేవలం మూడు నెలల్లోనే కంపెనీ రూ.8,501 కోట్ల లాభాలను ఆర్జించింది.