సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న యాత్రలపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మొత్తం పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని... ఇంకా ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెనాలిలో జరిగిన సాధికార సభ నిరూపించిందన్నారు. అక్కడి సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa