టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరీపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న ఆమెకు ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు చెప్పిందే చేశాం కాబట్టే సామాజిక సాధికార యాత్ర చేపట్టామని అన్నారు. టీడీపీ నేతల్లాగా మోసగించే మాటలు మాకు రావు అని అన్నారు. గతంలో టీడీపీ మేనిఫెస్టోలో విడుదల చేసిన హామిలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.